బస్సులో యువతి ఆత్మహత్య | Young Lady Committed Suicide In Bus By Having Poison | Sakshi
Sakshi News home page

బస్సులో యువతి ఆత్మహత్య

Published Wed, Jul 11 2018 12:24 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Young Lady Committed Suicide In Bus By Having Poison - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ బస్సులో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి భద్రాచలంలో యువతి బస్సు ఎక్కినట్లు తెలిసింది. బస్సు వీఎం బంజరు వద్దకు రాగానే యువతి నోటి నుంచి నురగలు వస్తుండటం తోటి ప్రయాణికులు గమనించి డ్రైవర్‌కు, కండక్టర్‌కు తెలిపారు. దీంతో వారు బస్సును ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు, యువతి మృతిచెందినట్లు ధృవీకరించారు.

 ఐడీ కార్డు ఆధారంగా మృతురాలు విజయవాడకు చెందిన లావణ్యగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇటీవలే యువతికి పెళ్లిచూపులు కూడా జరిగినట్లు తెలిసింది. చేతిపై మిస్‌ యూ డాడీ అంటూ పెన్నుతో యువతి రాసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement