ఫారూక్ మృతదేహం
విజయనగర్‌కాలనీ: బైక్ కొనుక్కుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన సుజిత్, షేక్ ఫారూక్ (21) స్నేహితులు. వీరు గురువారం ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన చూసి గుడిమల్కాపూర్‌కు చెందిన ఉమర్ అనే వ్యక్తి వద్ద కేటీఎం డ్యూక్ కొనుగోలు చేశారు. అనంతరం టోలిచౌకిలోని స్నేహితులను కలిసి అర్ధరాత్రి రేతిబౌలి నుంచి మెహిదీపట్నం వెళ్తుండగా పిల్లర్ నెం. 22 వద్ద రేతిబౌలి నుంచి యూ టర్న్ తీసుకుంటున్న ఇండికా క్యాబ్ వెనుకనుంచి వేగంగా ఢీ కొంది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న సుజిత్‌కు స్వల్ప గాయాలు కాగా వెనుక కూర్చున్న షేక్ ఫారూక్ రోడ్డుపై ఎగిరి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వారిని నానల్ నగర్‌లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన షేక్ ఫారూక్‌ను మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఫారూక్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment