
హరీష్‌రెడ్డి (ఫైల్)
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ముద్దనూరు రోడ్డుపై బొలెరో, ప్రైవేటు బస్సు ఆదివారం మధ్యాహ్నం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ శనివారపు హరీష్‌రెడ్డి(20) దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శివశంకర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
చిలంకూరుకు చెందిన హనుమంతరెడ్డి, లక్ష్మీదేవి కుమారుడు హరీష్‌రెడ్డి. ఆయనకు సొంతంగా బొలెరో వాహనం ఉంది. ఈ క్రమంలో డ్రైవింగ్ చేస్తూ చిలంకూరు నుంచి ఎర్రగుంట్లకు బయలుదేరారు. ఐసీఎల్ క్వారీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొంది.
బొలెరో బస్సు ముందు భాగంలోకి దూసుకొని పోయింది. దీంతో హరీష్‌రెడ్డి తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. బొలెరోలో ఇరుక్కున్న మృతదేహాన్ని.. రెండు క్రేన్‌లు తెప్పించి గంట పాటు శ్రమించి బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.