
దమ్మపేట: బాలికపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం రాచూరిపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కుక్కునూరు మండలం నల్లకుంటకు చెందిన బాలిక (15) రాచూరిపల్లిలో తమ బంధువుల ఇంటి వద్ద ఈ నెల 20న జరిగిన ఓ వేడుకకు హాజరైంది. 22న ఉదయం రాచూరిపల్లికి చెందిన తన స్నేహితురాలితో కలిసి గ్రామ శివారులోని జామాయిల్ తోటలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో తోటలో మద్యం తాగుతున్న ఏడుగురు యువకులు వీరి వెంట పడ్డారు.
రాచూరిపల్లికి చెందిన బాలిక తప్పించుకోగా, నల్లకుంటకు చెందిన బాలికపై ఏడుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. స్వగ్రామానికి వెళ్లిన బాలిక ఈ విషయం ఎవరికీ చెప్పలేక బాధ పడసాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆరా తీయగా, విషయం బయటపడింది. దీంతో కుటుంబసభ్యులతో కలిసి బాలిక గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment