
రామాంజనేయులు మృతదేహం
చేతగుడిపి(తర్లుపాడు) : గడ్డి వామి స్థలం వద్ద తగదాతో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని చేతగుడిపి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పొట్టేళ్ల రామాంజనేయులు(32) హత్యకు గురయ్యాడు. తర్లుపాడు ఎస్సై టి.లక్ష్మారెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన బైనబోయిన రామయ్య, బైనబోయిన లక్ష్మయ్య, పొట్టేళ్ల ఆంజనేయులకు గత కొంతకాలంగా వామి గడ్డి స్థలం వివాదం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఘర్షణలో ఇరువర్గాలపై కేసులు నమోదైంది.
సోమవారం పొదిలి మెజిస్ట్రేట్ కోర్టులో వామి గడ్డి స్థలం వివాదం కేసు, రాజీ పరిష్కారం చేశారు. అనంతరం స్వగ్రామానికి చేరిన ఇరు వర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పొట్టేళ్ల రామాంజనేయులను వరుసకు మామలైన బైనబోయిన రామయ్య, బైనబోయిన లక్ష్మయ్యలతో పాటూ మరికొంత మంది మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై తెలిపారు. తర్లుపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment