వరంగల్ (నర్సింహులపేట): వరంగల్ జిల్లా నర్సింహుల పేటలో దారుణం జరిగింది. అన్న చేతిలో తమ్ముడు దారుణహత్యకు గురైన ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో మురికి లక్ష్మయ్య(36)ను సొంత అన్న అంజయ్య గొడ్డలితో నరికి చంపాడు. అడ్డు వచ్చిన తమ్ముడి భార్యపై కూడా దాడి చేయడంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
గత కొన్ని నెలలుగా అన్నదమ్ముల మధ్య భూ తగదాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.