
రాయచూరు రూరల్: భూ వివాదం నేపథ్యలో దంపతులపై ప్రత్యర్థులు ట్రాక్టర్ ఎక్కించి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన లింగసూగూరు తాలూకా సర్జాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు హనుమంతు 50 ఏళ్లుగా 10 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే ఈ పొలం తమదంటూ మహానంది, దొడ్డ మల్లేష్, గోవిందు, వీరేష్‌లు శుక్రవారం రాత్రి మరో 15 మందితో కలిసి హనుమంతుతో గొడవ పడ్డారు. ఓ దశలో హనుమంతు, ఆయన భార్య శాంతమ్మలపై ట్రాక్టర్ ఎక్కించి ఉడాయించారు. స్థానికులు గమనించి దంపతులను రిమ్స్‌కు తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment