ట్రాక్టర్ బోల్తాపడి హమాలీ మృతి
ముగ్గురికి తీవ్రగాయాలు
మార్కెట్‌కు వెళ్తుండగా ఘటన
కేసముద్రం : మార్కెట్‌కు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని ధన్నసరి శివారు సబ్‌స్టేçÙన్‌తండా సమీపంలో శుక్రవారం జరిగింది. బంధువుల కథనం ప్రకా రం... మానుకోట మండలం ఇంద్రానగర్‌కి చెందిన దారావత్ అమర్‌సింగ్(48) కేసముద్రంలోని ఓ ఇండస్ట్రీస్‌లో హమాలీగా పనిచేస్తున్నాడు. ఇదే తండాకు చెందిన గుగులోతు వీరన్న ధాన్యా న్ని కేసముద్రం మార్కెట్లో అమ్మేందుకు ట్రాక్టర్లో లోడ్చేశాడు. వీరన్నతోపాటు అతడి భార్య నీలా, తల్లి బిచ్చి ట్రాక్టర్ ఎక్కగా, అమర్‌సింగ్ కూడా తన వద్దనున్న పెసర్లను అమ్మేందుకు బస్తాతో ట్రాక్టర్ ఎక్కాడు. ఇదే తండాకు చెందిన భూక్యా రాజ్‌ను కూడా మార్కెట్లో ధాన్యాన్ని అమ్మడానికి ఇదే ట్రాక్టర్ ఎక్కాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ కేసముద్రం వైపునకు వస్తుండగా సబ్‌స్టేçÙన్ తండా సమీపంలో పశువు అడ్డొచ్చింది. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా‡బ్రేక్ వేయడంతో లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ డబ్బా అదుపుతప్పి కిందపడిపోయింది. పైన కూర్చున్న వారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అమర్‌సింగ్ తల కు తీవ్రగాయాలు కాగా, నీలా తల, కాళ్లుచేతులకు గాయాలయ్యాయి. బిచ్చిని రెండుకాళ్లు విరిగి పోయాయి. రాజ్‌ను తలకు తీవ్రగాయమైంది. 108 సిబ్బంది చేరుకొని క్షతగాత్రులను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్సపొందూతూ అమర్‌సింగ్ మృతిచెందాడు. కాగా బిచ్చిని, నీలాను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడు అమర్‌సింగ్‌కు భార్య దారావత్ నీలా, ముగ్గురు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫణిదర్ తెలిపారు.