కారులో వచ్చి... ముఖంపై కారం చల్లి | young man trying to kidnap girl | Sakshi
Sakshi News home page

కారులో వచ్చి... ముఖంపై కారం చల్లి

Published Tue, Feb 6 2018 9:15 AM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM

young man trying to kidnap girl - Sakshi

ప్రసన్నఠాణేను అరెస్ట్‌ చేస్తున్న నాలుగో పట్టణ పోలీసులు ,పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు

విశాఖ క్రైం: గురుద్వార మందిరానికి వెళ్లి ప్రార్థన చేసి వస్తున్న ఓ యువతి ముఖంపై కారం చల్లి కారులో తీసుకెళ్లిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడు తీసుకొచ్చిన కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సీతమ్మధార బాలయ్యశాస్త్రి లే అవుట్‌లో అమృత హిల్స్‌ అపార్టుమెంట్‌లో కాన్పూర్‌కు చెందిన పునీత్‌కౌర్‌ తోటి ఉద్యోగులతో కలిసి నివసిస్తోంది. శంకరమఠం రోడ్డు శాంతిపురంలో గల ఐఐటీ, ఎన్‌ఐటీ కోచింగ్‌ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పునీత్‌కౌర్‌ పనిచేస్తుంది.

ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం పునీత్‌కౌర్‌ గురుద్వార కూడలిలో గల గురుద్వార మందిరానికి ప్రార్థన చేసుకునేందుకు వచ్చింది. అనంతరం మందిరం నుంచి బయటకు వచ్చిన సమయంలో గేటు వద్ద ఎంహెచ్‌ 05డీహెచ్‌ 6130 నెంబర్‌ గల కారులో ఉన్న ప్రసన్న ఠాణే మాటలు కలిపి ముఖంపై కారం చల్లాడు. అనంతరం తనతోపాటు కారులో తీసుకుపోయేందుకు యత్నించాడు. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో యువతి అరవడంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి ప్రసన్న ఠాణేను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ బెండి తిరుమలరావు సంఘటనా స్థలికి చేరుకుని ప్రసన్న ఠాణేను అదుపులోకి తీసుకున్నారు. పునీత్‌కౌర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రాజు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement