mirchi powder
-
ఏలూరు జిల్లా: శివస్వామికి కారంతో అభిషేకం
-
ఇక గుంటూరు బ్రాండ్ కారం
సాక్షి, అమరావతి: కారం అంటేనే గుంటూరు..! నాణ్యమైన మిర్చికి నగరమే చిరునామా.. ఇక అదే పేరుతో మార్కెట్లోకి కారాన్ని వదిలితే విక్రయాలకు తిరుగుంటుందా? గుంటూరు మిర్చి పవర్ అలాంటిది మరి! గుంటూరు మార్కెట్ కమిటీ తాజాగా ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశిస్తోంది. గుంటూరు మిర్చికున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదే బ్రాండ్‌తో కారం తయారీ, అమ్మకాలు చేపట్టాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన నాణ్యమైన ఎండుమిరప కాయలను ప్రాసెస్ చేసి కారం విక్రయాలు చేపడతారు. ఇప్పటికే మిర్చి నాణ్యతను నిర్థారించే యాంత్రిక పరికరాలను సమకూర్చుకోగా మార్కెట్ స్పందనను పరిశీలించి గుంటూరు మిర్చి యార్డు, పల్నాడు మార్కెట్ కమిటీల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించనున్నారు. దేశ విదేశాలకు గుంటూరు ఘాటు.. ఘాటుగా ఉండే గుంటూరు మిర్చికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. గుంటూరు మిర్చి యార్డులో ఏటా రూ.6 వేల కోట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయి. చైనా, థాయిలాండ్, సింగపూర్ తదితర దేశాలకు రూ.2,000 కోట్ల మేర మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి. ఎండుమిరప ప్రాసెసింగ్ ద్వారా రైతులకు అధిక ధరలతో పాటు మార్కెట్ కమిటీకి ఆదాయం సమకూరుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసురత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కారం తయారీ, విక్రయాలపై నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో మిల్లులను అద్దెకు తీసుకుని వచ్చే ఏడాది మార్చిలోపు కారం తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. మార్క్‌ఫెడ్ బ్రాండ్ మార్కెప్ పేరుతో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో మార్కెట్ కమిటీలు రైతులు పండించిన పంటలను ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉప ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభించడంతోపాటు కమిటీలు రైతులకు అధిక ధరలను ఇవ్వగలుగుతున్నాయి. ఇదే తరహాలో గుంటూరు మార్కెట్ కమిటీ కారం తయారీతో ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించనుంది. -
కారం పొడి చల్లుకున్న ఎంపీలు!
కొలంబో: శ్రీలంక పార్లమెంట్ శుక్రవారం తీవ్ర గందరగోళం మధ్య సాగింది. గురువారం రాత్రి అధ్యక్షుడు సిరిసేన అన్ని పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి, మరోసారి విశ్వాస పరీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాగా రాజపక్స మద్దతుదారులైన యూపీఎఫ్ఏ ఎంపీలు కొందరు స్పీకర్ కుర్చీని ఆక్రమించారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ఫర్నిచర్ విరగ్గొట్టారు. పుస్తకాలను విసిరేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడి చల్లారు. దీంతో స్పీకర్ పోలీసులను పిలిపించారు. సభ్యులను సముదాయించేందుకు యత్నించిన పోలీసులపైకి కూడా వారు కారం చల్లారు. ఈ దాడిలో ప్రత్యర్థి పార్టీల సభ్యులు కొందరు గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్..సభను సోమవారానికి వాయిదా వేస్తూ పోలీసు రక్షణ నడుమ బయటకు వెళ్లిపోయారు. -
కారులో వచ్చి... ముఖంపై కారం చల్లి
విశాఖ క్రైం: గురుద్వార మందిరానికి వెళ్లి ప్రార్థన చేసి వస్తున్న ఓ యువతి ముఖంపై కారం చల్లి కారులో తీసుకెళ్లిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడు తీసుకొచ్చిన కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సీతమ్మధార బాలయ్యశాస్త్రి లే అవుట్లో అమృత హిల్స్ అపార్టుమెంట్లో కాన్పూర్‌కు చెందిన పునీత్‌కౌర్ తోటి ఉద్యోగులతో కలిసి నివసిస్తోంది. శంకరమఠం రోడ్డు శాంతిపురంలో గల ఐఐటీ, ఎన్ఐటీ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పునీత్‌కౌర్ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం పునీత్‌కౌర్ గురుద్వార కూడలిలో గల గురుద్వార మందిరానికి ప్రార్థన చేసుకునేందుకు వచ్చింది. అనంతరం మందిరం నుంచి బయటకు వచ్చిన సమయంలో గేటు వద్ద ఎంహెచ్ 05డీహెచ్ 6130 నెంబర్ గల కారులో ఉన్న ప్రసన్న ఠాణే మాటలు కలిపి ముఖంపై కారం చల్లాడు. అనంతరం తనతోపాటు కారులో తీసుకుపోయేందుకు యత్నించాడు. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో యువతి అరవడంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి ప్రసన్న ఠాణేను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ బెండి తిరుమలరావు సంఘటనా స్థలికి చేరుకుని ప్రసన్న ఠాణేను అదుపులోకి తీసుకున్నారు. పునీత్‌కౌర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ రాజు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో కల్తీ దందా గుట్టురట్టు
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో మరో కల్తీ దందా ముఠాను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సాగర్ హైవే పక్కన మంగలపల్లిలో శ్రీ భవానీ ఏజెన్సీ పేరుతో ఓ గోడౌన్లో నకిలీ కారంతో పాటు ఇతరు తృణధాన్యాలను తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించి పట్టుకున్నారు. నాలుగు టన్నుల మిర్చి, 3.5 టన్నుల పసుపు పౌడర్, 1250 కిలోల ధనియాల పౌడర్, 320 కిలోల ఆవాలు, 2500 కిలోల ఇతర తృణధాన్యాలు, 15 కిలోల అయిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరు శ్రీ ఓం, చక్రం బ్రాండ్ల పేరుతో నకిలీ కారం, తదితరాలను అమ్ముతున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కళ్లలో కారం కొట్టి లక్షలు చోరీ
పటాన్చెరు(మెదక్): విధులు ముగించుకుని వెళ్తున్న ఓ ఉద్యోగి కళ్లలో కారం కొట్టి దుండగులు రూ.4.5లక్షలు అపహరించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం పటాన్చెరు పరిధిలో చోటు చేసుకుంది. కిష్టారెడ్డిపేటలోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్లో పనిచేస్తున్న విష్ణు అనే ఉద్యోగి బైక్‌పై వెళ్తున్నాడు. మార్గంమధ్యలో ఉండగా దుండగులు ఆ ఉద్యోగిని అడ్డగించి అతని కళ్లలో కారం కొట్టారు. అనంతరం అతని వద్ద ఉన్న నగదు రూ.4.5లక్షలు దోచుకుని పరారయ్యారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.