ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో మరో కల్తీ దందా ముఠాను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సాగర్ హైవే పక్కన మంగలపల్లిలో శ్రీ భవానీ ఏజెన్సీ పేరుతో ఓ గోడౌన్‌లో నకిలీ కారంతో పాటు ఇతరు తృణధాన్యాలను తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించి పట్టుకున్నారు.
నాలుగు టన్నుల మిర్చి, 3.5 టన్నుల పసుపు పౌడర్, 1250 కిలోల ధనియాల పౌడర్, 320 కిలోల ఆవాలు, 2500 కిలోల ఇతర తృణధాన్యాలు, 15 కిలోల అయిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరు శ్రీ ఓం, చక్రం బ్రాండ్ల పేరుతో నకిలీ కారం, తదితరాలను అమ్ముతున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.