నితిన్
దీపావళికి ఓ చిన్న సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు వెండితెర నయా ‘భీష్మ’. నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నేటి నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుందని సమాచారం. అక్కడ ఓ పాటతో పాటు, కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలిసింది. అలాగే ఈ దీపావళికి సినిమాకు సంబంధించిన ఓ చిన్న వీడియోను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment