
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
రాజమండ్రి: వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు సరిగా లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో సోము వీర్రాజు మాట్లాడుతూ..సినిమాలు లేని హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ అల్లకల్లోలం చేస్తున్నాడని విమర్శించారు. ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు ప్రభుత్వం మతితప్పి మాట్లాడుతోందని దుయ్యబట్టారు.
శివాజీ చెబుతున్నట్లు ఆపరేషన్ గరుడ నిజమే అయితే ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఎందుకు శివాజీని పిలిపించి వివరాలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై దాడి చంద్రబాబు స్క్రిప్ట్‌లో భాగమేనని ఆరోపణలు చేశారు. శివాజీ లాంటి జీరోను ఉపయోగించుకుని చంద్రబాబు పరిపాలించే హక్కు కోల్పోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌పై దాడి రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.