
సాక్షి, విజయనగరం : ప్రత్యేక హోదా విషయంలో చలసాని శ్రీనివాస్, నటుడు శివాజీలను నడిపిస్తోంది చంద్రబాబేనని, ఆయన తెరవెనుక ఉండి వారితో మాట్లాడిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన అడ్డంకి అని, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఆయనే అడ్డుకుంటున్నారని విమర్శించారు.
గతంలో అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాకు గిరిజన యూనివర్సిటీ, జాతీయ రహదారి, డిఫెన్స్ ప్రాజెక్టులను కేటాయించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment