రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం
Published Wed, Nov 23 2016 3:54 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
రాజమండ్రి: వస్త్రదుకాణ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన రాజమండ్రిలోని తాడితోటలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక మహత్మాగాంధీ హోల్‌సేల్ మార్కెట్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు షాపులు పూర్తిగా కాలి బూడిదకాగా పక్కనే ఉన్న మరో 11 షాపులకు మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం దుకాణ సముదాయంలోని 106 వ షాపు నుంచి 119వ షాపు వరకు దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.
Advertisement
Advertisement