
18న ఏపీ కేబినెట్ సమావేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ త్వరలో సమావేశం నిర్వహించనుంది. తన కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 18న(శనివారం) రాజమండ్రిలో సమావేశం నిర్వహించనున్నారు. రాజమండ్రి షెల్టాన్ హోటల్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. గోదావరి పుష్కరాల నిర్వహణ, రాజధాని మాస్టర్ ప్లాన్పై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.