'మజ్జిగ కోసం జిల్లాకు రూ.3కోట్లు' | ap cabinet meeting over | Sakshi
Sakshi News home page

'మజ్జిగ కోసం జిల్లాకు రూ.3కోట్లు'

Published Mon, Apr 18 2016 4:56 PM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

ap cabinet meeting over

విజయవాడ: వడదెబ్బ మృతులకు పరిహారం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సోమవారం పలు సమస్యలపైన విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా ప్రధానంగా వేసవి నేపథ్యంలో వచ్చే సమస్యలపై చర్చించింది.

వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ సరఫరాకు జిల్లాకు రూ.3కోట్లు మంజూరు చేసింది. చలివేంద్రాల్లో ఉచితంగా మజ్జిగ సరఫరా చేయాలని నిర్ణయించింది. మంచినీటి పథకాల పునరుద్ధరణకు రూ.200కోట్లు కేటాయించింది. 193 పీహెచ్సీలను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టూరిజం ప్రాజెక్టులకు 35 ఏళ్లపాటు లీజుకు భూకేటాయింపులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement