ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇసుక విధానంపై చర్చ జరగబోతోంది.
విజయవాడ: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇసుక విధానంపై చర్చ జరగబోతోంది. ప్రస్తుతం ఇసుక వేలంను ఆరు జిల్లాల్లో నిలిపివేశారు. సిండికేట్లు, మాఫియా చేతుల్లోకి ఈ జిల్లాల్లోని ఇసుక తరలింపు అంశంపై వెళ్లిపోయిన విషయాన్ని గుర్తించడంతో దాన్ని ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిలిపేశారు.
ఇక ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. చదరపు అడుగుకు 3,900 వరకు నిర్మాణ వ్యయం చెల్లించడానికి సిద్ధపడినట్లు తెలిసింది. అయితే, దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేయాల్సి ఉంది. సాగునీటిశాఖకు సంబంధించి కీలక ప్రతిపాదనకు ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించారు. రూ.6వేల కోట్ల విలువైన ప్రాజెక్టు అంచనాలు పెంచడం, నీటి ఎద్దడి, వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలపై చర్చ జరగనుంది.