ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాజమండ్రిలోని కోటి లింగాల రేవును పరిశీలించారు. ఈ నెల చివరిలోగా ఘాట్లకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.
రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాజమండ్రిలోని కోటి లింగాల రేవును పరిశీలించారు. ఈ నెల చివరిలోగా ఘాట్లకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. త్వరిత గతిన ఘాట్ పనులు పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. పనుల విషయంలో జాప్యం జరిగితే సహించేది లేదని అన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో శరవేగంగా నది ప్రవాహ ప్రాంతంలోని పలు చోట్ల పుష్కర స్నానాల కోసం ఘాట్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.