koti lingala
-
2 వేల ఏళ్లనాటి శాసనాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండు వేల ఏళ్లకు పూర్వపు రెండు అపురూప శాసనాలు జగిత్యాల జిల్లాలో వెలుగుచూశాయి. ఇందులో ఒకటి గతంలోనే చరిత్రకారులు గుర్తించారు. రెండోది దానికి చేరువలోనే లభించిన కొత్త శాసనం. శాతవాహనుల తొలి రాజధాని కోటలింగాలకు సమీ పంలోనే ఇవి లభించడం విశేషం. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం మొక్కట్రావుపేటలోని మునులగుట్టపై ఇవి చెక్కి ఉన్నాయి. ఈ గుట్టపై జైనుల స్థావరాలున్నాయని ప్రముఖ చరిత్రకారులు పరబ్రహ్మశాస్త్రి గతంలో పేర్కొనగా, బౌద్ధుల ఆవాసాలని జితేంద్రబాబులాంటి మరికొందరు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన చరిత్రకారుడు రాజారాంసింగ్ ఇక్కడ శాసనమున్నట్టు గతంలో పేర్కొన్నారు. తాజాగా స్థానిక యువకుడు సముద్రాల సునీల్ వీటిని గుర్తించారని, అవి శాతవాహనులకు సంబంధించినవేనని చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రాకృత భాష, బ్రాహ్మీలిపిలో ఉన్న ఈ శాసనాల్లో ఒకదానిలోని అక్షరాలు బాగా చెరిగిపోయాయి. ఇందులో ఒకవైపు స్వస్తికం, మరోవైపు బౌద్ధంలోని త్రిరత్న గుర్తులున్నాయి. ఇది బుద్ధపాదాలను దానం చేసినపుడు వేయించిన శాసనంగా భావిస్తున్నారు. రెండో శాసనంలో ‘మణికరస సామిరేవస ధమథానం... సివప ఖరితస వాపి’అన్న అక్షరాలున్నాయి. మణికారుడు (వజ్రాల వ్యాపారి) సామిరేవుని ఆదేశంతో సివప అనే వ్యక్తి ఆ ధర్మస్థలంలో బావిని తవ్వించాడన్న అర్థంలో ఉన్నట్టు చెప్పారు. -
బ్రహ్మంగారి మాట నిజమౌతోంది
సాక్షి, ఏలూరు : పవిత్రమైన స్వామీజీలను బహిష్కరించడం, అరెస్టు చేయడం దుర్మార్గమని కోటిలింగాల శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. బుధవారం ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన హిందూసంస్థలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ నెల 19న (గురువారం) తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో అన్నీ ధార్మక సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. టీటీడీలో అవకతవకలు బయటపెట్టేందుకు ఈ నెల 29నుండి హిందూ సమాజం రోడ్డెక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మకు సారె సమర్పించిన అనంతరం 30 మంది పీఠాధిపతులతో చలో తిరుపతి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. 300 మంది శిష్యులతో రోజూ 30 కిలోమీటర్లు మేర 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 500 గ్రామాల్లో హిందూత్వంపై చైతన్యం తీసుకొచ్చి, ఆగస్టు 12న సాయంత్రం తిరుపతిలోని ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాలనుండి 100 మంది పీఠాధిపతులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. తిరుమల గురించి బ్రహ్మంగారు ముందే చెప్పారని, కొండపైకి దారులన్నీ మూసుకుపోయి, ఆరుగురు దొంగలు స్వామి వారి ఆభరణాలు దోచుకుంటారని కాలజ్ఞానంలో చెప్పారని అన్నారు. తొమ్మిది రోజులు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామనడంపై ఇప్పుడు అవే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే కమిటీ వేయాలని, హిందూ సమాజానికి భరోసా ఇవ్వాలని డిమాండ్ శివస్వామి డిమాండ్ చేశారు. -
‘కోటిలింగాల’లో చరిత్ర విధ్వంసం!
నాలుగు వైపులా మహా బురుజులు, వాటిని అను సంధానిస్తూ మహా ప్రాకారంతో ఉండిన కోటి లింగాల నగరం తెలుగు చరిత్రకు ఆద్యులుగా పేర్కొనే శాతవాహనుల తొలి రాజధాని. దేశంలో మూడోవంతు ప్రాంతాన్ని మూడు శతాబ్దాల పాటు ఏలిన ఘన చరిత్ర వారి సొంతం. జగి త్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని గోదావరి తీరంలో ఈ నగరం ఉంది. 1 970వ దశాబ్దంలోనే పురావస్తు శాఖ అధికారులు తాత్కాలికంగా తవ్వ కాలు జరిపి అలనాటి నగర ఆనవాళ్లను గుర్తిం చారు. దాని ఆధారంగా నగరం విస్తీర్ణం, దాని రూపుపై ప్రాథమిక అంచనాలు వెల్లడించారు. అయితే ఇక్కడ కోటిలింగాలలో పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపే అంశం 40 ఏళ్లుగా పక్కన పడింది. ఇటీవల హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ విశా లాచ్చి దీనిపై దృష్టి సారించారు. ఆ ప్రాంతంలోని భూములను సేకరించి.. తవ్వకాలు జరిపే ప్రతి పాదనను తెరపైకి తెచ్చారు. కానీ.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో చారిత్రక ఆనవాళ్లు ప్రమాదంలో పడ్డాయి. – సాక్షి, హైదరాబాద్ పుష్కరాల సందర్భంగా.. గోదావరి పుష్కరాల సమయంలో జిల్లా అధికారులు కనీస అవగాహన లేకుండా చారిత్రక ఆనవాళ్లున్న ప్రాం తాన్ని దెబ్బతీశారు. ఇక్కడ నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల వాహనాల కోసం చారిత్రక ఆన వాళ్లున్న స్థలాన్నే పార్కింగ్‌గా వినియో గించారు. ఆ స్థలంలో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో మొరం మట్టి పోయించి.. రోడ్డు రోలర్లతో చదును చేయించారు. దాంతో చారిత్రక ఆనవాళ్లకు నష్టం కలిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవు తోంది. గోదావరి పుష్కరాలు 2015 జూలైలోనే జరిగినా.. ఇప్పటివరకు పురావస్తుశాఖ గుర్తించలేకపోయింది. ఇటీవల దీనిపై ఫిర్యాదులు రావడంతో.. వెళ్లి పరిశీలించిన పురావస్తు అధికారులు అవాక్క యినట్టు తెలిసింది. పార్కింగ్ కోసం మట్టిపోసి చదును చేసిన చోట చారిత్రక నిర్మాణాల పైభాగాలు దెబ్బతిని ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఆ ప్రాంతంలో సాగు పెరిగింది. కోటిలింగాలలోనూ 30 ఎకరాల మేర వ్యవసాయం మొదలైంది. దీంతో భూగర్భంలోని నిర్మాణాలు దెబ్బతినే అవకాశముందని అంటున్నారు. -
కోటిలింగాల.. కోటిదండాలు
కరీంనగర్ : కోటి లింగాల పుష్కరఘాట్లు జనంతో పోటెత్తారు. పావన గౌతమిలో స్నానమాడి పాపహరణం చేసుకున్నారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పుష్కరస్నానం ఆచరించారు. కోటేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండి పోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పవిత్ర గోదావరిలో మునకలు వేస్తూ పుణ్యఫలాలు దక్కించుకున్నారు. గురువారం అమావాస్య కావడం వల్ల పిండప్రదానాలు చేసే వారు అధికంగా తరలివచ్చారు. గోదావరి సంకల్పానికి దూరంగా పుష్కర స్నానం గోదావరిలో పుష్కర స్నానం చేసి గోదావరి సంకల్పాన్ని చెప్పించుకుంటే సర్వ పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే కోటిలింగాలలో పాత ఘాట్లనే పుష్కర స్నానాలకు వినియోగిస్తున్నందున బ్రాహ్మణులను అక్కడికి అనుమతించడం లేదు. ఫలితంగా గోదావరి సంకల్పానికి భక్తులు దూరమవుతున్నారు. -
కోటి లింగాల రేవును సందర్శించిన బాబు
రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాజమండ్రిలోని కోటి లింగాల రేవును పరిశీలించారు. ఈ నెల చివరిలోగా ఘాట్లకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. త్వరిత గతిన ఘాట్ పనులు పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. పనుల విషయంలో జాప్యం జరిగితే సహించేది లేదని అన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో శరవేగంగా నది ప్రవాహ ప్రాంతంలోని పలు చోట్ల పుష్కర స్నానాల కోసం ఘాట్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. -
'కోటిలింగాలలో ఇళ్లు తొలగించడం దారుణం'
-
కోటిలింగాలలో ఇళ్లు తొలగించడం దారుణం: వైఎస్ జగన్
రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కోటి లింగాల పుష్కర్ ఘాట్‌ను పరిశీలించారు. కోటిలింగాలలో పుష్కరాలకు ముందు ఇళ్లు తొలగించడం దారుణమని వైఎస్ జగన్ విమర్శించారు. ఆదివారం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను తొలగించడం వల్ల ప్రభుత్వ పెద్దలకు పాపం చుట్టుకుంటుందని వైఎస్ జగన్ అన్నారు. కోటిలింగాల బాధితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులకు నామినేటెడ్ పద్ధతిలో పనులు కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో జరిగే అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కుమారుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, ప్రియాంకల విహహానికి హాజరవుతారు. అలాగే ఇటీవల వివాహమైన కాకినాడ రూరల్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు కుమారుడు నరేష్, కోడలు స్రవంతిలను వైఎస్ జగన్ ఆశీర్వదించనున్నారు. ఈ రోజు సాయంత్రం మధురపూడి విమానాశ్రయం నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.