నాలుగు వైపులా మహా బురుజులు, వాటిని అను సంధానిస్తూ మహా ప్రాకారంతో ఉండిన కోటి లింగాల నగరం తెలుగు చరిత్రకు ఆద్యులుగా పేర్కొనే శాతవాహనుల తొలి రాజధాని. దేశంలో మూడోవంతు ప్రాంతాన్ని మూడు శతాబ్దాల పాటు ఏలిన ఘన చరిత్ర వారి సొంతం. జగి త్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని గోదావరి తీరంలో ఈ నగరం ఉంది. 1
970వ దశాబ్దంలోనే పురావస్తు శాఖ అధికారులు తాత్కాలికంగా తవ్వ కాలు జరిపి అలనాటి నగర ఆనవాళ్లను గుర్తిం చారు. దాని ఆధారంగా నగరం విస్తీర్ణం, దాని రూపుపై ప్రాథమిక అంచనాలు వెల్లడించారు. అయితే ఇక్కడ కోటిలింగాలలో పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపే అంశం 40 ఏళ్లుగా పక్కన పడింది. ఇటీవల హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ విశా లాచ్చి దీనిపై దృష్టి సారించారు. ఆ ప్రాంతంలోని భూములను సేకరించి.. తవ్వకాలు జరిపే ప్రతి పాదనను తెరపైకి తెచ్చారు. కానీ.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో చారిత్రక ఆనవాళ్లు ప్రమాదంలో పడ్డాయి. – సాక్షి, హైదరాబాద్
పుష్కరాల సందర్భంగా..
గోదావరి పుష్కరాల సమయంలో జిల్లా అధికారులు కనీస అవగాహన లేకుండా చారిత్రక ఆనవాళ్లున్న ప్రాం తాన్ని దెబ్బతీశారు. ఇక్కడ నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల వాహనాల కోసం చారిత్రక ఆన వాళ్లున్న స్థలాన్నే పార్కింగ్‌గా వినియో గించారు. ఆ స్థలంలో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో మొరం మట్టి పోయించి.. రోడ్డు రోలర్లతో చదును చేయించారు. దాంతో చారిత్రక ఆనవాళ్లకు నష్టం కలిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవు తోంది.
గోదావరి పుష్కరాలు 2015 జూలైలోనే జరిగినా.. ఇప్పటివరకు పురావస్తుశాఖ గుర్తించలేకపోయింది. ఇటీవల దీనిపై ఫిర్యాదులు రావడంతో.. వెళ్లి పరిశీలించిన పురావస్తు అధికారులు అవాక్క యినట్టు తెలిసింది. పార్కింగ్ కోసం మట్టిపోసి చదును చేసిన చోట చారిత్రక నిర్మాణాల పైభాగాలు దెబ్బతిని ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఆ ప్రాంతంలో సాగు పెరిగింది. కోటిలింగాలలోనూ 30 ఎకరాల మేర వ్యవసాయం మొదలైంది. దీంతో భూగర్భంలోని నిర్మాణాలు దెబ్బతినే అవకాశముందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment