
రాజమండ్రి: తాను కాపు అని అందరూ అంటున్నారనీ, కానీ తనకు కులం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాక్యానించారు. రాజమండ్రిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఉద్వేగంగా ప్రసగించారు. 2014లో ఏమీ ఆశించకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చానని చెప్పారు. తాను సీఎం కుమారుడిని కాదని, కేవలం సాదాసీదా కానిస్టేబుల్ కుమారుడిని మాత్రమేనని అన్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలా తన దగ్గర డబ్బులు లేవని అన్నారు. పవన్ బలం గోదావరి జిల్లాలేనని కొందరు అంటున్నారని, అది తప్పని నిరూపిస్తా అన్నారు. సీమలో తనకూ బలం ఉందని తొడగొట్టి చెప్పాలా సూటిగా ప్రశ్నించారు. జనం కోరుకుంటే తెలంగాణాలో కూడా రాజకీయాలు చేస్తానని చెప్పారు. కులాలను కలిపేది జనసేన మాత్రమేనని వ్యాక్యానించారు. తెలంగాణాలో ఆంధ్రావాళ్లను కొందరు నీచంగా చూశారని ఆరోపించారు. ఏపీలో అధికారం కేవలం రెండు కులాల మధ్యే ఊగిసలాడుతోందని ఆరోపించారు.
ప్రతికుటుంబానికి రూ. 10 లక్షల భీమా
జనసేన అధికారంలోకి రాగానే అన్నికులాల విద్యార్థులకు ఒకటే హాస్టల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల బీమా కల్పిస్తానని తెలిపారు. ప్రతి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతుకు సాయం చేస్తామని వెల్లడించారు. అలాగే రైతులకు ఉచితంగా సోలార్ మోటార్ పంపులు అందిస్తామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఒకటి నుంచి పీజీ వరకు అంతా ఉచితంగా విద్యనందిస్తామని అన్నారు. డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment