పుష్కర స్నానమాచరించిన ఎమ్మెల్యే రోజా | roja in godavari pushkaralu at rajamundry | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానమాచరించిన ఎమ్మెల్యే రోజా

Published Sat, Jul 18 2015 2:27 PM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

పుష్కర స్నానమాచరించిన ఎమ్మెల్యే రోజా

పుష్కర స్నానమాచరించిన ఎమ్మెల్యే రోజా

రాజమండ్రి: రాజమండ్రి వీఐపీ పుష్కరఘాట్‌ వద్ద సందడి నెలకొంది. ఉదయం నుంచి పలువురు వీఐపీలు పుష్కరస్నానాలకు క్యూకట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా కూడా కుటుంబ సమేతంగా వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. గోదావరమ్మ తల్లికి నీరాజనాలు అర్పించారు.

కాగా వరుస సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో రాజమండ్రి వైపు వెళ్లే రహదారులు వాహనాలతో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలుచోట్ల వాహనాలు పెద్ద ఎత్తున స్తంభించిపోయాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement