'3 నిమిషాల్లోనే స్నానాలు ముగించండి'
రాజమండ్రి : తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు గోదావరి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. కోటిలింగాల రేవులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గంటలకు 70 వేల మంది పుష్కర స్నానాలు ఆచరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
కాగా గోదావరిలో బ్యాక్టీరియా పెరుగుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకోలీ బ్యాక్టీరియా విజృంభిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇలాంటి నీళ్లలో ఎక్కువ సేపు ఉండరాదని వారు పేర్కొన్నారు. ఈకోలి బ్యాక్టీరియా ఉన్నందున 3 నిముషాల్లోనే భక్తులు స్నానాలు పూర్తి చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.