రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నయువకుడిని ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిచెందిన యువకుడు రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన శివ(18)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని యువకుడి మృతి
Published Thu, Oct 1 2015 9:10 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement