
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోరిక అని పేర్కొన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ, రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని సూచించారు. (అమరావతి భూముల విషయంలో త్యాగమేముందీ..?)
Comments
Please login to add a commentAdd a comment