ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆనందం ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉండవల్లి విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత బాబు ప్రెస్‌మీట్‌లో నవ్వుతూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిందితుడికి నార్కో టెస్టు చేయిస్తే నిజాలు బయటకొస్తాయన్నారు. వైఎస్సార్ కుటుంబానికి డ్రామాలంటే ఇష్టం ఉండదని ఉండవల్లి పేర్కొన్నారు.