నచ్చకపోతే తిట్టండి | pandugadi photo studio movie press meet | Sakshi
Sakshi News home page

నచ్చకపోతే తిట్టండి

Sep 21 2019 1:22 AM | Updated on Sep 21 2019 1:22 AM

pandugadi photo studio movie press meet - Sakshi

దిలీప్‌ రాజా

‘‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమా నచ్చితే ఇతరులకు చెప్పండి.. నచ్చకపోతే నన్ను తిట్టండి. ఎక్కడైనా తప్పు ఉంటే ఎత్తి చూపండి.. సరిదిద్దుకుంటాను’’ అని దర్శకుడు దిలీప్‌ రాజా అన్నారు. అలీ, రిషిత జంటగా పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్‌ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దిలీప్‌ రాజా మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఏపీలో చిత్రీకరించిన తొలి సినిమా మాదే. ఈ సినిమాలో మా హీరో ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లయిపోతుంది.

ఎందుకు అలా జరుగుతుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  పూర్తి గ్రామీణ నేపథ్యంలో మా చిత్రం కొనసాగుతుంది. మా కథను దర్శకుడు సుకుమార్‌గారు ఓకే చేసిన తర్వాతే చిత్రీకరణ మొదలుపెట్టాం. దర్శకులు జంధ్యాల, కె. బాలచందర్‌ గార్ల ఆశీర్వాదం మా సినిమాకి ఉంటుందని భావిస్తున్నా. యాజమాన్య చక్కని సంగీతం అందించారు. ఈ చిత్రంలో అలీని కమర్షియల్‌ హీరోగా చూపించాను. నేను బ్లాక్‌బస్టర్‌ తీశానా? సక్సెస్‌ఫుల్‌ సినిమా తీశానా? ఫెయిల్యూర్‌ సినిమా తీశానా? అని నిర్ణయించేది ప్రేక్షకులే. వారి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement