ఫొటో తీస్తే పెళ్లయిపోద్ది | Pandugadi Photo Studio Post Production Completed | Sakshi
Sakshi News home page

ఫొటో తీస్తే పెళ్లయిపోద్ది

Published Fri, Jun 7 2019 12:52 AM | Last Updated on Fri, Jun 7 2019 12:52 AM

Pandugadi Photo Studio Post Production Completed - Sakshi

రిషిత, అలీ

అలీ, రిషిత జంటగా దిలీప్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది’ అన్నది ఉపశీర్షిక. పెదరావూరు ఫిలింసిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దిలీప్‌ రాజా మాట్లాడుతూ– ‘‘జంధ్యాల మార్క్‌ కామెడీతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో మా హీరో అలీ ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లి అయిపోతుంది. ఇందులోని పాత్రలు విలక్షణంగా, నటీనటుల పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. నూతన నటుడు సందీప్‌ రాజా, టీనా చౌదరి ఈ చిత్రంలో విలక్షణ పాత్రలు పోషించారు.  పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. బాబుమోహన్, సుధ, జీవా, శ్రీలక్ష్మీ, రామ్‌జగన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్‌ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement