
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వైఎస్సార్ సీపీ నాయకుడు, సినీ నటుడు అలీ కొనియాడారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మరోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సీపీ అధికారంలో వచ్చి మూడేళ్లు పూర్తవడంతో పాటు త్వరలో ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆదివారం వైఎస్సార్ సీపీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో అలీ పాల్గొన్నారు.
రాష్ట్ర చరిత్రలో అవినీతికి తావులేకుండా ప్రజల వద్దకే సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ ఆస్ట్రేలియా కో–ఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీగా సంఖ్యలో హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment