ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతుంటాడు. తాజాగా అలీ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. విద్యా వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కు చేయూత ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆస్ట్రేలియన్ అర్వేంసిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యంతో మెరిట్ విద్యార్థులకు చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పించబోతున్నారు.
ఈ విషయంపై తాజాగా అలీ మీడియాతో మాట్లాడుతూ..చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఏమి చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు. అలాంటి వారికి చేయూతనివ్వడానికి అర్వేంసిస్ సభ్యులు సభ్యులు ముందుకు రావడం సంతోషంగా ఉంది. వీళ్లు విద్య వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కి చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. ఇదేకాదు ఒకవేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరిస్తే.. ఇండియా నుంచి 20 మంది రైతులను అక్కడకు తీసుకెళ్లి ఉపాధి అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను’అని అలీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment