
కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన సీతాకోకచిలుక’చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అనతికాలంలోనే స్టార్ కమెడియన్‌గా పాపులర్ అయ్యారు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే, మరోపక్క బుల్లితెరపై కూడా ఆకట్టుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఏమాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారాయన. ఇక అలీ భార్య జుబేదా ఈ మధ్యే యూట్యూబ్‌లో ఎంట్రీ ఇచ్చి రకరకాల వీడియాలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వీరికి ముగ్గురు సంతానం. తాజాగా అలీ పెద్దకూతురు ఫాతిమా గురించి ఓ గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకున్నారు. ఫాతిమా డాక్టర్ అయ్యింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్ అంటూ అలీ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా తన కూతురు డాక్టర్ కావడం అలీ కోరిక అని తెలుస్తుంది. అలీ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫాతిమాకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment