Comedian Ali Wife Shocking Reaction on Ali Marriage With Subhashri - Sakshi
Sakshi News home page

Subhashri: హీరోయిన్‌తో అలీ పెళ్లి, ఫొటో చూసి షాకైన కమెడియన్‌ భార్య

Apr 8 2022 5:32 PM | Updated on Apr 8 2022 6:18 PM

Comedian Ali Wife Shocking Reaction on Ali Marriage With Subhashri - Sakshi

తను చిన్నపిల్లలతో ఆడుకునే సమయంలో ఓ అబ్బాయి వచ్చి సైట్‌ కొట్టేవాడంది. అలా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నామని తన లవ్‌ స్టోరీని చెప్పుకొచ్చింది. అతడు డైమండ్‌ రింగ్‌ను తొలి బహుమతిగా ఇచ్చాడంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. తాను స్కూలుకు వెళ్లకుండా ఉండటానికే సినిమాల్లోకి వచ్చానంది. 

అలనాటి హీరోయిన్‌ మాలశ్రీ చెల్లెలు శుభశ్రీ కూడా కథానాయికగా రాణించింది. మలయాళ చిత్రాలతో పాటు ఊహ, పెదరాయుడు వంటి పలు తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అసలు పేరు భారతి పాండే. కానీ ఆమె పోషించిన శుభశ్రీ పాత్ర పాపులర్‌ కావడంతో అదే ఆమె అసలు పేరుగా మారిపోయింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

తను చిన్నపిల్లలతో ఆడుకునే సమయంలో ఓ అబ్బాయి వచ్చి సైట్‌ కొట్టేవాడంది. అలా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నామని తన లవ్‌ స్టోరీని చెప్పుకొచ్చింది. అతడు డైమండ్‌ రింగ్‌ను తొలి బహుమతిగా ఇచ్చాడంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది శుభశ్రీ. తాను స్కూలుకు వెళ్లకుండా ఉండటానికే సినిమాల్లోకి వచ్చానంది. 

కాగా శుభశ్రీ, అలీ 'అల్లరి పెళ్లికొడుకు' సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాలో వీళ్లిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటుండగానే ఆ పెళ్లి ఫొటో బయటకు వచ్చింది. దీంతో ఓ మ్యాగజైన్‌ అలీ, శుభశ్రీ పెళ్లైపోయిందంటూ ఓ కథనం రాయగా అది చూసి అలీ భార్య షాకైందట! ఆ సంఘటనను తలుచుకుని శుభశ్రీ పడీపడీ నవ్వింది.

చదవండి: అదే జరిగితే రాజమౌళిని చంపేస్తారు.. ఎన్టీఆర్‌

Ghani Movie Review: ‘గని’ పంచ్‌ ఎలా ఉందంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement