
ముస్కాన్, అలీ, కృష్ణ
కృష్ణ, ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల దర్శకత్వంలో సి. యశోదమ్మ, టి. చేతన్ నిర్మించిన చిత్రం ‘నేచర్’. ఈ సినిమాలోని ‘నిన్నే చూడందే..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను రిలీజ్ చేసిన అలీ మాట్లాడుతూ – ‘‘నాకు ఇళయరాజాగారి పాటలంటే ఇష్టం. ఈ పాట ఆయన పాటలను గుర్తు చేసింది. యం.ఎల్. రాజా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘నేచర్’ టైటిల్ బాగుంది.
ప్రకృతి బాగుంటే మనందరం బాగుంటాం’’ అన్నారు. ‘‘ప్రకృతిని ఇష్టపడే ఓ కుర్రాడు ప్రేమలో పడ్డాక ఎన్ని కష్టాలు పడ్డాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? అన్నది ఈ సినిమా కథ’’ అన్నారు అశ్విన్ కామరాజు. ‘‘ఈ సినిమాకు పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు ఎమ్‌ఎల్ రాజా. ‘‘సుధాకర్, రవి టీచర్స్. ఈ సినిమాకి ఇద్దరూ చక్కటి కథను రెడీ చేశారు’’ అన్నారు గౌతమ్ రాజు.
Comments
Please login to add a commentAdd a comment