
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రముఖ నటుడు అలీ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో అలీ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌ను కలిశాను. త్వరలోనే గుడ్‌న్యూస్ ఉంటుందని ఆయన చెప్పారు. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాం. త్వరలోనే నా పదవిపై పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన వస్తుంది.
రెండు వారాల్లోనే ప్రకటన ఉంటుందని అనుకుంటున్నాను.ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నా. సామాన్యులకు కూడా సినిమా టికెట్ అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన. చిన్న సినిమాకు కూడా లాభం ఉండాలన్నదే మా ఉద్దేశం అని అలీ అన్నారు. చదవండి: తిరుపతిలో స్టూడియోలు ఏర్పాటు చేస్తాం: మంచు విష్ణు
Comments
Please login to add a commentAdd a comment