
తమ కుమార్తె వివాహానానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు అలీ దంపతులు. ఈ మేరకు వారు తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ కమెడియన్ అలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అలీ దంపతుల కూతురు ఫాతిమా త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు అలీ దంపతులు. ఈ మేరకు బుధవారం నాడు తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక తొలిప్రతిని అందించారు. ఈ సందర్భంగా తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించినందుకు సీఎం జగన్‌కు అలీ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం అలీ మాట్లాడుతూ.. 'రాజకీయాలలో సహనం ఎంతో అవసరం. అది కోల్పోయి మాట్లాడితే జనమే తిరగబడతారు. బూతులు తిట్టడమే రాజకీయం అనుకోవటం కరెక్ట్ కాదు. సీఎం జగన్ ప్రజల మనిషి. వారికోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ఈసారి 175 కి 175 సీట్లు కచ్చితంగా సాధిస్తారు. గతంలో జగన్ మీద నమ్మకంతోనే జనం 151 సీట్లు గెలిపించారు. ఈసారి 175 సీట్లు గ్యారంటీగా వస్తాయి. ఆ క్రతువులో నావంతు పాత్ర పోషిస్తా. సీఎం చెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తా. ఇకనుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా మరో అలీని చూస్తారు' అని తెలిపారు.
చదవండి: రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది: నటి
కాంతార కలెక్షన్ల వర్షం, తెలుగులో ఎంత వచ్చిందంటే