Actor Ali Receives Doctorate From KLU University, See His Comments On CM YS Jagan - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ పాలన అద్భుతంగా ఉంది: సినీ నటుడు అలీ

Published Sat, Dec 11 2021 5:40 PM | Last Updated on Sun, Dec 12 2021 1:19 PM

Actor Ali Praises CM YS Jagan Ruling In AP - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన అద్భుతంగా ఉందని సినీ నటుడు అలీ అన్నారు. కేఎల్‌యూ డాక్టరేట్‌ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో అన్ని వర్గాలకు వైఎస్‌ జగన్‌ సమన్యాయం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.

చదవండి: సాయితేజ కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం

టాలీవుడ్‌లో సమస్యగా మారిన ఆన్‌లైన్‌ టికెట్ల విధానం,  బెనిఫిట్ షో  వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని,  హామీ కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సొంత ఊరిలో ఉండగా ఈ డాక్టరేట్ రావడం మరింత సంతోషం కలిగించిందన్నారు. ఇప్పటి వరకు తాను 5 భాషల్లో  1124  సినిమాల్లో నటించినట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement