నందమూరి తారకరత్న మృతి ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తుంది. తీవ్ర గుండెపోటుతో గత 27న బెంగళూరులోని నారాయణ హృదయాలలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్నను బతికించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే తారకరత్నకు 9 సంఖ్య కలిసిరాలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీలో చాలామంది న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతారు. ఇక ఎక్కువగా తొమ్మిది అంకెను లక్కీ నెంబర్ అని భావిస్తారు. కానీ తారకరత్నకు మాత్రం 9కలిసి రాలేదని చెప్పాలి.తారకరత్న ముందుగా ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో 2002లో హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
అదే ఏడాది వరుసగా 9సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. కానీ ఇందులో కేవలం మూడు సినిమాలు మాత్రమే సెట్స్ మీదకి వెళ్లాయి. ఇక గత నెల 27న ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ రెండు అంకెలను కలిపితే వచ్చేది 9 (2+7=9). ఇక ఆయన మరణించిన తేదీ ఫిబ్రవరి 18,(1+8=9) ఈ రెండు అంకెలను కలిపినా తొమ్మిదే వస్తుంది. ఇలా జరిగిన పరిణామాలన్నీ చూస్తే తారకరత్నకు తొమ్మిదవ నెంబర్ కలిసి రాలేదనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment