SSMB28: మహేశ్‌ సినిమాలో విలన్‌గా నందమూరి హీరో? ట్వీట్‌తో క్లారిటీ! | SSMB28: Taraka Ratna Plays As Villain In Mahesh Babu, Trivikram Movie | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్‌ సినిమాలో విలన్‌గా నందమూరి హీరో?, ట్వీట్‌తో క్లారిటీ!

Published Sat, May 28 2022 9:12 PM | Last Updated on Sat, May 28 2022 9:17 PM

SSMB28: Taraka Ratna Plays As Villain In Mahesh Babu, Trivikram Movie - Sakshi

Taraka Ratna As Villain In Mahesh Babu SSMB28 Movie?: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సర్కారు వారి పాట మూవీతో బిజీగా ఉన్న మహేశ్‌ త్వరలోనే త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28(#SSMB28) అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్‌  ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

చదవండి: మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్‌, వీడియో వైరల్‌

దీనిపై సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్‌డే రోజున(మే 31) స్పష్టత వచ్చే అవకాశం ఉందని వినికిడి. ఇక జూలైలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నందమూరి హీరో తారకరత్న ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: ఓటీటీకి శివకార్తికేయన్‌ లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘డాన్‌’, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్‌

అయితే ఇందులో వాస్తవమెంత అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఆ సందేహాలకు తెర దించుతూ  తారకరత్న తాను మహేశ్ 28వ సినిమాలో చేయనున్నట్టు ఒక ట్వీట్ వదిలాడు. విలనిజానికి సంబంధించిన ఒక ఎమోజీని జోడించాడు. గతంలో తారకరత్నా పలు చిత్రాల్లో విలన్‌గా చేసి మెప్పించిన సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమాలో ఆయన  పాత్రను ఎలా డిజైన్ చేశారనేది ఆసక్తి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement