
నటుడు తారకరత్న మృతిని కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్న మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ మోకిలలో తన నివాసానికి తరలించగా పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా తారకరత్న నివాసానికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నటుడి పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు.