
నటుడు నందమూరి తారకరత్న ఇక లేరన్న వార్తను కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మనసున్న మారాజు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పలువురు సినీప్రముఖులు, అభిమానులు ఫిలిం చాంబర్‌కు చేరుకుని నివాళులు అర్పించారు.
ఈ క్రమంలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి అక్కడకు వచ్చి తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించాడు. ఆ తర్వాత బాలకృష్ణ దగ్గరకు వెళ్లి వేలెత్తి చూపుతూ గట్టిగా ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. బాలయ్య కూడా అతడు చెప్పింది శ్రద్ధగా వింటున్నట్లు తలూపాడు. వెంటనే పోలీసులు అతడిని బయటకు తీసుకెళ్లారు. కాగా కాసేపటిక్రితమే తారకరత్న అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment