
కొన్నాళ్లుగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న మృత్యుంజయుడిగా వస్తారనుకున్నారంతా.. కానీ ఆ పోరాటంలో ఓడిపోయి అసువులు బాశారు. తన కుటుంబాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా అందరికీ తారకరత్నగా పరిచయమైన ఆయనకు ఓ ముద్దుపేరు ఉంది. ఆయన అసలు పేరు ఓబులేసు. ఇంట్లోవాళ్లు ముద్దుగా ఓబు అని పిలుస్తారట.
కాగా గత నెల 27న లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆ సమయంలో మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడుకు ఒకవైపు వాపు వచ్చింది. వెంటనే ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించి మెరుగైన వైద్యం అందించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రెండు రోజులుగా పరిస్థితి విషమించగా మహాశివరాత్రి నాడు శివైక్యమయ్యారు.
చదవండి: అప్పటిదాకా ఉత్సాహంగా.. ఉన్నట్టుండి కుప్పకూలిన తారకరత్న
Comments
Please login to add a commentAdd a comment