నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. నందమూరి అభిమానులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే నందమూరి తారకరత్న జీవితంపై అభిమానుల్లో ఆరా తీస్తున్నారు. ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. మరో మూడు రోజుల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. ఈ సమయంలో ఇలా జరగడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కాగా.. నందమూరి తారకరత్న ఫిబ్రవరి 22న 1983లో జన్మించారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు నందమూరి తారకరత్న. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాకి వచ్చిన సక్సెస్‌తో ఆయన ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రకటించి వరల్డ్ రికార్డ్ సాధించారు. అయితే వాటిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.
ఆ తర్వాత తారకరత్న అమరావతి అనే సినిమాలో విలన్ పాత్రకు గాను నంది అవార్డు సైతం అందుకున్నాడు. రవిబాబు దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment