
గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడిన నటుడు నందమూరి తారకరత్న(39) శనివారం తుదిశ్వాస విడిచారు. మరో మూడు రోజుల్లో ఆయన పుట్టినరోజు(ఫిబ్రవరి 22) ఉండగా ఇంతలోనే మరణించడంతో అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహనకృష్ణ తనయుడిగా తారకరత్న 20 ఏళ్ల వయసులోనే ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తారకరత్నకు తెలిసిన స్నేహితుల ద్వారా అలేఖ్యరెడ్డి పరిచయమైంది. ఆమె పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.
తారక్ సినిమా నందీశ్వరుడికి అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. కానీ వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. కారణం అలేఖ్యకు ఇదివరకే పెళ్లై విడాకులు కావడమే! అయినా వెనక్కు తగ్గని తారకరత్న 2012లో ఓ గుడిలో తనను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇరు కుటుంబాలు ఈ జంటను చేరదీశాయి. 2013లో వీరి ప్రేమకు గుర్తుగా నిషిక అనే పాప జన్మించింది. పాపు పుట్టాక తన ఆలనా పాలనా చూసుకోవడానికి సినిమాలకు దూరంగా ఉంది అలేఖ్య. కానీ ఇలా తారకరత్న అర్ధాంతరంగా తనువు చాలించడంతో అలేఖ్య, ఆమె కూతురు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment