నటుడు తారకరత్న మరణాన్ని కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారక్‌ను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. శంకర్‌పల్లిలోని తారకరత్న నివాసానికి చేరుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
నందమూరి తారకరత్న 20 ఏళ్ల వయసులోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఒకే రోజు 9 సినిమాలను ప్రకటించి రికార్డు సృష్టించారు. 2002లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో సూపర్ హిట్ సాధించారాయన. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన అమరావతి సినిమాలో విలన్‌గా మెప్పించారు. ఈ సినిమాలో ఈయన నటనకు నంది అవార్డు కూడా లభించింది.
అయితే ఆ తర్వాత తారకరత్నకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని తన కుటుంబానికి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఆ సమయంలోనే చాలా ఇబ్బందులు పడ్డారట తారకరత్న. కనీసం పిల్లల అవసరాలు కూడా తీర్చలేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నకు నెలకు నాలుగు లక్షల రూపాయలు పంపించారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.
అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూలో తారకరత్న మాట్లాడుతూ.. 'ఈరోజు మా ఫ్యామిలీ ఇలా ఉండడానికి కారణం ఎన్టీఆర్. నా తమ్ముడు లేకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా తమ్ముడు అండగా నిలిచాడు.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment