కావలి చైర్మన్ అలేఖ్యకు హైకోర్టులో షాక్! | high court vacates stay on ineligibility of kavali chairman | Sakshi
Sakshi News home page

కావలి చైర్మన్ అలేఖ్యకు హైకోర్టులో షాక్!

Published Thu, Dec 11 2014 5:46 PM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

high court vacates stay on ineligibility of kavali chairman

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు మారినవారికి ఎదురుదెబ్బలు తప్పడంలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మునిసిపల్ చైర్మన్ అలేఖ్యకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె అనర్హతపై స్టేను హైకోర్టు గురువారం నాడు ఎత్తేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అలేఖ్య.. ఆ తర్వాత పార్టీ మారారు. దాంతో అలేఖ్య చైర్మన్ పదవికి అనర్హురాలంటూ కావలి ఆర్డీవో నిర్ణయం తీసుకున్నారు.

15 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల అధికారికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు ఆమె అనర్హతపై ఉన్న స్టేను కోర్టు ఎత్తేసింది. అనర్హత పిటిషన్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement