
నందమూరి తారకరత్న మరణం పట్ల మంచు మోహన్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. నందమూరి తారకరత్న మరణ వార్త విని నిజంగా షాక్ అయ్యాను. మనసంతా కలచివేసినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం నేను లండన్ లో, విష్ణు సింగపూర్ లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా రాలేకపోతున్నాం. నా అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు అయిన తారకరత్న నాకూ, నా కుటుంబానికి చాలా ఆత్మీయుడు.
తారకరత్న ఎంత మంచివాడో, ఎంత సౌమ్యుడో, స్నేహశీలో చెప్పటానికి నాకు మాటలు రావడం లేదు. టీవీల్లో అతని మరణ వార్తకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే బాధతో గుండె తరుక్కుపోతుంది. తారకరత్న మరణం ఒక్క నందమూరి కుటుంబానికే కాదు ....యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అని మంచు మోహన్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. మంచు విష్ణు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించాడు.
#TarakaRatna 💔. I hate this. I am not able to believe this. Numb. 💔
— Vishnu Manchu (@iVishnuManchu) February 18, 2023