నయీమ్ కథతో ఖయ్యుమ్
గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితకథ ఆధారంగా భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖయ్యుమ్ భాయ్’. ఏసీపీగా నందమూరి తారకరత్న, ఖయ్యుమ్‌గా కట్టా రాంబాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి కట్టా శారదా చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
‘‘నయీమ్ చిన్ననాటి నుంచి ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఘటన వరకూ సినిమాలో చూపిస్తున్నాం. సినిమాలో యాక్షన్ సీన్లు హైలైట్‌గా నిలుస్తాయి. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు కట్టా రాంబాబు. నటులు ‘బాహుబలి’ ప్రభాకర్, చిన్నా, బెనర్జీ, ఫైట్ మాస్టర్ విజయ్, దర్శకుడు భరత్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర.