Ashika Ranganath Interesting Comments About Amigos Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Ashika Ranganath: అలాంటి సినిమాల్లో నటించాలనేది నా కల

Published Sun, Jan 29 2023 8:36 AM | Last Updated on Sun, Jan 29 2023 2:36 PM

Ashika Ranganath Talk About Amigos Movie - Sakshi

‘‘తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగులో నటించాలని కొన్నేళ్లుగా అనుకుంటున్నాను. గతంలో కొన్ని కథలు నచ్చకపోవడం, మరికొన్ని నా డేట్స్‌ కుదరక చేయలేదు. కానీ ‘అమిగోస్‌’ కథ వినగానే నచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ వంటి పెద్ద ప్రొడక్షన్‌లో నా తొలి చిత్రం చేయడం నా అదృష్టం. ‘అమిగోస్‌’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని ఆషికా రంగనాథ్‌ అన్నారు.

‘‘బింబిసార’ వంటి హిట్‌ చిత్రం తర్వాత కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన చిత్రం ‘అమిగోస్‌’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న కన్నడ హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ శనివారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అమిగోస్‌’లో నేను రేడియో జాకీ పాత్ర చేశాను. నేటితరం అమ్మాయిలకు నా పాత్ర బాగా నచ్చుతుంది. స్క్రీన్‌పై నా పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. ఇక తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్‌గార్ల డ్యాన్స్‌ అంటే ఇష్టం. రాజమౌళిగారు తీసిన ‘బాహుబలి’ లాంటి సినిమాలో నటించాలనేది నా కల. ప్రస్తుతం కన్నడ, తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్నాను. తెలుగులో కొన్ని కథలు చర్చల్లో ఉన్నాయి’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement