
నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బింబిసార. కేథరిన్, సంయుక్త మీనన్, వారీనా హుసేన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష‍్ణ. కె నిర‍్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ఉపశీర్షిక. వశిష్ట్ దర‍్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సోమవారం బింబిసార ట్రైలర్ విడుదల చేశారు.
రాక్షసులెరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం.. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుని విశ్వరూపం.. అంటూ కథానాయకుడి పాత్రను పరిచయం చేశారు. 'బింబిసారుడంటేనే మరణ శాసనం. ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే..', 'పట్టుమని వంద మంది కూడా లేరు, ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు', 'ఎవడ్రా నిన్ను పంపింది అని పైనున్న ఆ యముడు అడిగితే చెప్పు, కింద ఒకడున్నాడు.. వాడి పేరు బింబి, త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడని చెప్పు..' అంటూ కల్యాణ్ రామ్ డైలాగ్స్‌తో గర్జించాడు. మొత్తానికి పవర్‌ఫుల్ యాక్షన్‌తో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది.
చదవండి: పిల్లల్ని కనడం గురించి సద్గురును అడిగిన ఉపాసన, ఆయన సమాధానమేంటంటే?
పైరసీ భూతం 'తమిళ్ రాకర్స్'పై వెబ్ సిరీస్..
Comments
Please login to add a commentAdd a comment